నేడు బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ తులం పసిడి ధర రూ. 50 పెరిగింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,938, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,110 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెరిగింది. దీంతో రూ.91,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెరిగింది. దీంతో రూ. 99,380 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read:Vassishta : విశ్వంభర కథ ఇదే.. ఆ సినిమాకు కాపీ లాగే ఉందిగా.?
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,520 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,23,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,13,900 వద్ద ట్రేడ్ అవుతోంది.