ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. పలు కీలక శాఖలకు సంబంధించి సమీక్ష
బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం పాఠశాలల్లో బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఈరోజు ఉదయం 10 గంటలకు పోలీసుల విచారణకు హాజరుకానున్న కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
వాలంటీర్ల మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
నేడు బాపట్లలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన.. బాపట్ల ఆర్టీసీ డిపోలో అధికారులతో సమీక్ష
నేటి నుండి రెండు రోజులు పాటు అన్నవరం సత్యదేవుని ఆలయంలో 135వ ఆవిర్భావ ఉత్సవాలు.. శ్రావణ శుద్ధ విదియా పర్వదినం సందర్బంగా రేపు ఆలయంలో ఆయుష్ హోమము ప్రత్యేక పూజలు అభిషేకాలు
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
నేటి నుంచి రెండ్రోజులు మాల్దీవుల్లో మోడీ పర్యటన
నేడు ఐదవ రోజు పార్లమెంట్ సమావేశాలు.. గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనలు
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, భారత్ నాలుగో టెస్ట్.. నేడు కొనసాగనున్న మూడో రోజు ఆట
