Site icon NTV Telugu

Telangana Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ..

1

1

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also: Stree 2: ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేయనున్న ఆ యంగ్ హీరో..?

అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి్.. రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతిపై కేసీఆర్ ను ఉద్దేశించి ఓ వీడియోను కూడా అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణా జలాలపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామ అధికార కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఇవాళ కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు తెలంగాణ ప్రజలకు అసలు నిజాలు చెప్తామన్నాంటున్నారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారు.. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీలోనే చెప్పారనే విషయాన్ని ప్రజలకు అధికార కాంగ్రెస్ పార్టీలు తెలిపారు.

Exit mobile version