NTV Telugu Site icon

Today (19-01-23) Stock Market Roundup: ప్రపంచం బాధ.. ఇండియా మీద..

Stock Market Update

Stock Market Update

Today (19-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండు రోజులు వచ్చిన లాభాలకు బ్రేక్‌ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు కూడా సాయంత్రం నష్టాలతోనే ముగిశాయి. మార్నింగ్‌ సెషన్‌లో వచ్చి భారీ నష్టాలను మాత్రం ఇంట్రాడేలో కొంత వరకు పూడ్చుకోగలిగాయి.

read more: Gold Imports: డిసెంబర్‌లో 79 శాతం తగ్గిన బంగారం దిగుమతి

కానీ.. అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్లో నెలకొన్న ముందుజాగ్రత్తల ప్రభావం ఇండియన్ స్టాక్‌ మార్కెట్‌ పైన ప్రతికూలంగా పడింది. దీంతో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేజ్‌ మరియు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండెక్స్‌లు నేల చూపులు చూశాయి. సెన్సెక్స్‌ చివరికి 187 పాయింట్లు కోల్పోయి 60 వేల 858 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్పంగా 57 పాయింట్లు తగ్గి 18 వేల 107 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.

సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్‌లో 10 స్టాక్స్‌ లాభాలను ఆర్జించాయి. ఏసియన్‌ పెయింట్స్‌ షేర్ల విలువ తీవ్రంగా దెబ్బతింది. ఈ కంపెనీ తాజా త్రైమాసిక ఫలితాలు ముందస్తు అంచనాలకు తగ్గట్లు లేకపోవటంతో స్టాక్స్‌ వ్యాల్యూ 3 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీలో కోలిండియా, యూపీఎల్‌ బాగా రాణించాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. ఓఎన్‌జీసీ స్టాక్స్‌ 2 శాతం ప్రాఫిట్స్‌ పొందాయి.

తద్వారా 6 నెలల గరిష్ట విలువకు చేరుకున్నాయి. సంస్థ లాభాల్లో భారీ వృద్ధి నెలకొంటుందనే పాజిటివ్‌ సెంటిమెంట్‌ కలిసొచ్చింది. రంగాల వారీగా చూస్తే.. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు సైతం లాభాల్లో కోతలకు గురయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సున్నా పాయింట్‌ 6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఐటీ సూచీదీ ఇదే పరిస్థితి. 10 గ్రాముల బంగారం ధర 92 రూపాయలు పెరిగి అత్యధికంగా 56 వేల 378 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది.

కేజీ వెండి రేటు 266 రూపాయలు నష్టపోయి గరిష్టంగా 67 వేల 961 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్‌ ధర 107 రూపాయలు తగ్గి ఒక బ్యారెల్‌ చమురు 6 వేల 403 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 36 పైసల వద్ద స్థిరపడింది.