NTV Telugu Site icon

Election Commission: జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన

Jammu Kashmir

Jammu Kashmir

Election Commission: జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కట్టుబడి ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.

Read Also: Odisha Assembly Polls: ఒడిశాలో 4 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. షెడ్యూల్ ఇదే..

ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుండి జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. 4,892 ఎన్నికైన గ్రామ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం 2024 జనవరిలో ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ మేరకు ఎన్నికల సంఘం శనివారం ప్రకటన చేసింది.

లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో నిర్వహిస్తుండగా.. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.