G20 Summit: చైనాను టెక్నాలజీలో రారాజుగా పిలుస్తారు. గత రెండేళ్లలో ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. భారత ప్రభుత్వం చైనీస్ యాప్‌లను నిషేధించినప్పటి నుండి ఈ విషయంలో చైనా నిరంతరం విఫలమవుతోంది. ఇప్పుడు జీ20 సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గైర్హాజరు కావడం చైనాకు మరింత ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చచు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అంతం చేసేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధం కానుంది. ఈ రోడ్‌మ్యాప్‌ను భారత్, అమెరికా, గల్ఫ్ దేశాలు కలిసి తయారు చేయబోతున్నాయి. మధ్యప్రాచ్యంలో చైనా ఆధిపత్యానికి ప్రధాన నిదర్శనం దాని భారీ పెట్టుబడి. గత 15 ఏళ్లలో చైనా మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో 273 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అంతం చేసేందుకు భారత్, అమెరికాలు అప్రమత్తమయ్యాయి.
జీ20 శిఖరాగ్ర సమావేశంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికపై నిర్ణయం తీసుకోవచ్చు. యూఏఈ ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఉమ్మడి ఒప్పందాన్ని ప్రకటించవచ్చు. ఈ ప్రకటన వెలువడితే ఇప్పుడు రైలు నెట్‌వర్క్ ద్వారా చైనాను చుట్టుముట్టేందుకు సన్నాహాలు చేస్తారు. ఈ ప్రణాళిక ప్రకారం గల్ఫ్ దేశాలు రైలు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించబడతాయి. దీని ద్వారా భారతదేశం కూడా షిప్పింగ్ మార్గాల ద్వారా ఈ ప్రాంతాల ఓడరేవులకు అనుసంధానించబడుతుంది.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలలో ఈ ఒప్పందం భాగం అవుతుంది. ఇప్పుడు అందులో అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలు, భారత్ కూడా చేరాయి. ఈ ఒప్పందం నిజంగా చైనా శక్తిని తగ్గించే అవకాశం ఉందని భావిస్తుననారు. ఇటీవల గల్ఫ్ దేశాలపై తన పట్టును బలోపేతం చేయడానికి సౌదీ అరేబియా, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనా సహాయం చేసింది. తద్వారా దాని ఆధిపత్యం మరింత పెరగవచ్చు. జీ20 సమయంలో ఈ ఒప్పందంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది నిస్సందేహంగా చైనా శక్తిని తగ్గిస్తుంది.
త్వరలోనే మెగా రైలు నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తారు. అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, భారతదేశం ప్రతి ఒక్కరినీ కనెక్ట్ చేస్తాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమాసియాలో రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటు కానుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందులో అమెరికా వంటి అగ్రరాజ్యాలతోపాటు గల్ఫ్ దేశాలు కూడా ఉంటాయి. నాలుగు పెద్ద శక్తులు కలిస్తే మధ్యప్రాచ్య దేశాలకు చైనా వైపు మొగ్గు తగ్గుతుంది. దీని వల్ల భారత్ నేరుగా లబ్ధి పొందనుంది. మధ్యప్రాచ్య దేశాలు బలమైన భాగస్వామి కోసం చూస్తున్నాయి. భారతదేశం వీటికి అవకాశం కావొచ్చు.
Read Also:Gujrat: అద్దెకు ఇళ్లు తీసుకున్న ఒక అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. కట్ చేస్తే షాక్