Site icon NTV Telugu

West Bengal: పోలింగ్ రోజున సీబీఐ రైడ్స్‌పై సీఈవోకి టీఎంసీ ఫిర్యాదు

Mae

Mae

శుక్రవారం దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే పశ్చిమబెంగాల్‌లో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే.. ఇంకోవైపు సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులకు తెగబడింది. ఈ పరిణామాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికలు జరుగుతుండగా సీబీఐ రైడ్స్ చేయడాన్ని తప్పుపడుతూ.. రెండు పేజీల లేఖతో పశ్చిమబెంగాల్ ఎన్నికల అధికారికి టీఎంసీ ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: Congress: ‘‘ముస్లిం ఓట్లు కావాలి కానీ, అభ్యర్థులు వద్దా..?’’ కాంగ్రెస్‌ని ప్రశ్నించిన మైనారిటీ నేత..

శుక్రవారం సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్ బంధువు ఇంట్లో సీబీఐ దాడులు చేసింది. కేంద్ర భద్రతా బలగాల సాయంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఈ దాడుల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అనేక బాంబుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే సీబీఐ అధికారులు ఘటనాస్థలికి వచ్చారు. పేలుడుపదార్థాలను గుర్తించేందుకు బాంబు స్కానింగ్ పరికరాలను కూడా తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే సందేశ్‌ఖాలీ ఘటనతో పశ్చిమబెంగాల్ అట్టుడికింది. భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌పై మహిళలు ఆరోపించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. వీరికి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సపోర్టుగా నిలిచారు. మొత్తానికి కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 55 రోజుల తర్వాత షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక హైకోర్టు తీరుపై కూడా మమత సర్కార్ గుర్రుగా ఉంది. సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో కూడా టీఎంసీ సర్కార్ పిటిషన్ వేసింది.

ఇది కూడా చదవండి: Pensions Distribution: ఇంటింటికి పెన్షన్ల పంపిణీ.. సీఎస్‌కు ఈసీ ఆదేశాలు.

ఇక పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. సందేశ్‌ఖాలీ బాధిత మహిళలను పరామర్శించారు. వారి బాధలను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బాధిత మహిళకు బీజేపీ టికెట్ కూడా ఇచ్చింది.

 

Exit mobile version