NTV Telugu Site icon

ED Team: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ బృందంపై 300 మంది దాడి

Ed

Ed

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ రహస్య స్థావరంపై దాడి చేసేందుకు ఈడీ బృందం వచ్చింది. ఆ తర్వాత దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ బృందం గాయపడింది. టీఎంసీ నేతలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు ఈడీ కారు అద్దాలను పగులగొట్టారు.

Read Also: Jasprit Bumrah: తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా అరుదైన రికార్డు.. సచిన్‌కు సైతం సాధ్యం కాలే!

కేంద్ర బలగాలతో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంటికి ఈడీ చేరుకుని అతడి ఇంటి తాళం పగులగొట్టింది. దీంతో గ్రామస్తులు గుమిగూడి ఈడీ బృందంపై దాడి చేశారు. ఆ ప్రాంతం నుంచి ఈడీ టీమ్ ను తరిమికొట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే, ఈ దాడిని ప్రొత్సహించిన టీఎంసీ నేతలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరైన ప్రమేయం ఉన్నా శిక్ష పడాల్సిందే అని ఈడీ అధికారులు చెప్పుకొచ్చారు.

Read Also: Yatra 2: తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న కొడుకుగా చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుంది

ఇక, ఈడీ టీమ్ పై దాడిని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈడీపై జరిగిన దాడి జరిగిన కూడా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు రోహింగ్యాలు విఘాతం కలిగిస్తుందో బీజేపీ నాయకుడు అన్నారు.