NTV Telugu Site icon

Titanic Watch Action: వేళల్లో కోట్లకి అమ్ముడుబోయిన టైటానిక్ ప్రయాణికుడి వాచ్.. ఎన్ని కోట్లంటే..

Watch Actiom Titanic

Watch Actiom Titanic

టైటానిక్ డిజాస్టర్ గురించి మనకి తెలిసిందే. ఏప్రిల్ 15, 1912 న, ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచుతో ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. ఈ విపత్తులో అమెరికన్ వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్‌ కూడా మరణించాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అయితే అతడు ధరించిన బంగారు వాచీ ఇటీవలే ఇంగ్లండ్‌లో జరిగిన వేలంలో అమ్ముడుపోయింది. అందులో వాచ్ కు రికార్డు స్థాయిలో ధర పలికింది.

Also read: Shruti Haasan: శృతి హాసన్‌తో బ్రేకప్ ధృవీకరించిన మాజీ ప్రియుడు..సారీ అంటూనే!

అది నిర్వహకులకు ఊహించని విధంగా 1.46 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 12.17 కోట్లకు విక్రయించబడింది. ఈ విషయాన్ని హెన్రీ ఓల్డ్ రిడ్జ్ అండ్ సన్ కంపెనీ ప్రకటించింది. ఈ కంపనీ వాచ్‌ ను వేలానికి ఉంచగా.. వేలంలో ఈ వాచీ ధర ఒకటి నుంచి ఒకటిన్నర మిలియన్ పౌండ్ల వరకు అంటే కోటి రూపాయల నుంచి ఒకటిన్నర కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ ఒక అమెరికన్ ఔత్సాహికుడు తన అంచనాలను మించి, అంత ఎక్కువ ధరకు కొనుగోలు చేశాడు.

Also read:Jairam Ramesh: మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..

ఇక ఈ టైటానిక్ ఉదాంతంపై హాలీవుడ్లో తీసిన టైటానిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధిగాంచిందో చెప్పాల్సిన అవసరం లేదు. టైటానిక్ మునిగిపోయినప్పటి నుంచి ఇప్పటికి ఆ ప్రాంతంలో టైటానిక్ సంబంధించి అనేక శిధిలాలను ఇప్పటికీ చాలామంది బయటకు తీసుకొస్తూనే ఉన్నారు.