NTV Telugu Site icon

Titanic Door: రోజ్ ప్రాణాలను కాపాడిన తలుపు వేలం.. వామ్మో అన్ని కోట్లకు అమ్ముడబోయిందా..?!

9

9

హాలీవుడ్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తింపు ఉండిపోయే సినిమాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోని ఓ విషాద ప్రయాణం. అయితే ఈ సినిమా నిజమైన సంఘటనకు ఆధారంగా చేసుకుని రూపొందించింది. ఈ భయంకర ప్రమాదంలో సముద్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు అనుగుణంగా తీసిందే టైటానిక్ సినిమా. ఇక ఈ సినిమా కేవలం ప్రమాద సంఘటనకు సంబంధించిన సినిమా మాత్రమే కాకుండా ఓ ప్రేమ కథగా కూడా తెరకెక్కించారు. ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు.

Also read: Neha Shetty: పేరు మార్చుకున్న నేహా శెట్టి? ఏంటో తెలుసా?

ఈ హాలీవుడ్ చిత్రం ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఆల్టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఈ చిత్రం ఎన్నో ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుంది. ఇక సినిమాలో హైలెట్ సీన్ అంటే.. హీరోయిన్ రోజ్ కోసం హీరో కేట్ జాక్ తన ప్రాణాలను వదిలేస్తాడు. హీరో తన ప్రియురాలిని రక్షించేందుకు.. హీరోయిన్ ను ఓ తలుపుపై ఉంచి.. అతడు మాత్రం గడ్డ కట్టే చల్లటి నీటిలో ఉండిపోతాడు. ఇప్పటికీ ఆ సన్నివేశం ప్రేక్షకుల కళ్ళముందు తలుచుకుంటే కనపడుతుంది. ఇకపోతే తాజాగా హీరోయిన్ రోజ్ ప్రాణాలను కాపాడిన తలుపును వేలం వేసినట్లుగా సమాచారం.

Also read: Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా

సమాచారం మేరకు.. సినిమాలో హీరోయిన్ ప్రాణాలను రక్షించడంలో తలుపు ఇటీవల వేలం వేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫ్లోటింగ్ డోర్ ఏకంగా 7,18,750 డాలర్లు అనగా మన దేశ కరెన్సీలో రూ. 5,98,92,107 అంటే సుమారు రూ. 6 కోట్లకు అమ్ముడయ్యింది. ఈ తలుపు అత్యధిక వసూలు సాధించిన వస్తువుగా హెరిటేజ్ ఆక్షన్ ట్రెజర్స్ లో నిలిచింది. ఇక వీటితో పాటు ఆ సీన్‌లో హీరోయిన్ కేట్ విన్స్లెట్ ధరించిన డ్రెస్ కూడా వేలం వేయబడింది. హీరోయిన్ ధరించిన షిఫాన్ దుస్తులు కూడా 1,25,000 డాలర్లకు అనగా మన దేశ కరెన్సీలో రూ.1,04,17,143.75 గా అమ్ముడయ్యాయి.

Show comments