Site icon NTV Telugu

Minister Anita: విద్యార్థినికి న్యాయం చేస్తాం.. మహిళల రక్షణే మా లక్ష్యం..!

Home Minister Anitha

Home Minister Anitha

Minister Anita: తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసు పురోగతిపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఆమె తిరుపతి ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్సనల్‌గా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు, సంబంధిత సమాచారం సేకరించేందుకు కూడా ఒడిశాకు ప్రత్యేక పోలీసుల బృందాన్ని పంపినట్లు తెలిపారు.

Suzuki 350cc Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ.. 350 సీసీ బైక్‌ను విడుదల చేస్తోన్న సుజుకీ!

విద్యార్థినికి న్యాయం చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఈ ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. మహిళల రక్షణకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇలాంటి సంఘటనలను ఏ విధంగానూ సహించబోమని ఆమె హెచ్చరించారు. చూడాలి మరి ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టనుందో..

IND vs SA Records: దక్షిణాఫ్రికాపై భారత్‌దే పైచేయి.. టీ20 సిరీస్‌ షెడ్యూల్‌, ఫుల్ టీమ్స్, ముఖాముఖి రికార్డులు ఇవే!

Exit mobile version