Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Rural ZPTC Result 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 5న నిర్వహించిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు నవంబర్ 7న జరిగింది. ఈ కౌంటింగ్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానంపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఉదయం 5 గంటల వరకు కొనసాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం సాధించారు. దాంతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం సంబరాలు చేసుకుంది.ఓట్ల లెక్కింపు ఉదయం 5 గంటల వరకు కొనసాగింది.
చెవిరెడ్డి భాస్కర్రె డ్డి కుమారుడైన హర్షిత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 602 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హర్షిత్ రెడ్డికి 41,119 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థికి 40,517 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లో వైసీపీకి 177, టీడీపీకి 216 ఓట్లు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణనలోకి తీసుకున్న అనంతరం హర్షిత్ రెడ్డి 602 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం మారుతూ, కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. చివరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికారులు హర్షిత్ రెడ్డి 602 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. లక్షన్నరకు పైగా ఓటర్లు ఉన్న ఈ జెడ్పీటీసీ పరిధిలో సుమారు 85 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠను రేకెత్తించడంతో అభ్యర్థులు, పార్టీల శ్రేణుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. చివరికి హర్షిత్ రెడ్డి విజయం ఖరారు కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.
Also Read
- Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
- Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
- India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
- Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో చాలా స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానంలో మాత్రం వైఎస్సార్సీపీ తన పట్టును నిలుపుకుంది. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను 7 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. చింతపల్లి, పెదబయలు, అనంతగిరి, జీకే వీధి, డుంబ్రిగూడ, పాడేరు, హుకుంపేట జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
-
Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!