Site icon NTV Telugu

Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahulgandhi

Rahulgandhi

తిరుపతి లడ్డూ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల పవిత్రతను పరిరక్షించేలా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తిరుమలలో లడ్డూల కల్తీపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ సీనియర్​ నేత రాసుకొచ్చారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తనను ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పూజించే దేవుడు బాలాజీ అని పేర్కొన్నారు. అలాంటి ప్రసిద్ధ ఆలయంలో లడ్డూలు కల్తీ అయ్యాయన్న విషయం ప్రతి ఒక్క భక్తుడినీ బాధిస్తోందని తెలియజేశారు. దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని వ్యాఖ్యానించారు.

READ MORE: CM Chandrababu: సీఎం చంద్రబాబుకు నందమూరి మోహనకృష్ణ రూ. 25 లక్షల విరాళం

రాహుల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. “తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. బాలాజీ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసిస్తున్న దేవుడు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని అధికారులు మన మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి.” అని రాసుకొచ్చారు.

READ MORE: Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసం.. ఏకంగా 50 మంది మహిళల ట్రాప్..

ఇదిలా ఉండగ.. తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం కాదు జంతువుల కొవ్వు వాడుతున్నారని ఆరోపణలు చేశారని సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇక, జంతువుల కొవ్వు కలిపారాన్న బాబు ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని చెప్పారు.

Exit mobile version