SP Subbarayudu: టెంపుల్ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు అటు తిరుపతి వాసులతో పాటు.. ఇటు తిరుమల శ్రీవారి భక్తులకు ఆందోళనకు గురి చేశాయి.. తిరుపతిలోని ప్రముఖ హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి.. ఐఎస్‌ఐ పేరుతో వచ్చిన మెయిల్స్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆయా హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.. ఎలాంటి బాంబులు లేవని తేల్చారు.. ఇక, ఈ ఘటనలపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కీలక ప్రకటన చేశారు.. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నాం అన్నారు.. నగరంలో భద్రత పెంచాం.. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నాం.. బెదిరింపులు వచ్చిన అన్ని హోటల్లో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాం.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదు.. వస్తున్న మెయిల్స్ పై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ సహకారంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం అని వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు..
Read Also: YSRCP: డైవర్షన్ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం