Site icon NTV Telugu

Tirumala Darshanam: నేడు సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లు విడుదల..!

Tirumala

Tirumala

Tirumala Darshanam: కలియుగ దేవుడు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. స్వామివారి దర్శనం కోసం సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను నేడు ఆన్లైన్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను నేడు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే…

Read Also: Missing Woman Found Alive: చనిపోయిందని అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులు.. నెల రోజుల తర్వాత తిరిగొచ్చిన మహిళ

నేడు (జూన్ 23)న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు స్వామి వారి శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లను కూడా విడుదల చేయనుంది. అయితే మంగళవారం (జూన్ 24)న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. కాబట్టి ఎవరైనా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నవారు ముందుగా ప్లాన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా టికెట్స్ ను పొందవచ్చు.

Read Also: Mega157 : చిరు – అనిల్ మరో షెడ్యూల్ స్టార్ట్

ఇకపోతే, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్ది కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి బయట శిలాతోరణం వరకు క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. కాబట్టి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న (ఆదివారం) శ్రీవారిని 87254 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 33777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీలో 4.28 కోట్ల కానుకలు వచ్చాయి.

Exit mobile version