NTV Telugu Site icon

Tirumala: కాసేపట్లో తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

Tirumala

Tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ రిలీజ్ చేస్తుంది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈరోజు ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే, శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకోవాలనుకుంటున్న భక్తులు టీటీడీకి చెందిన ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించి నిన్న ( సోమవారం ) శ్రీవాణి భక్తుల దర్శనం టిక్కెట్లతో పాటు వసతి కోటా టిక్కెట్లను కూడా విడుదల చేసింది.

Read Also: Road Accident: తమిళనాడులో రోడ్ టెర్రర్.. లారీ-సుమో ఢీ, 7 మంది మృతి

అయితే, తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళం అందించాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన వికాస్ కుమార్ కిషోర్ బాయ్ ఆదివారం రాత్రి అశ్వవాహన సేవలో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి డీడీని ఇచ్చారు. అలాగే, అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ శుక్రవారం టీటీడీ అన్నప్రసాదం విభాగానికి 9.5 టన్నుల బరువు గల 2 లక్షల రూపాయల విలువైన కూరగాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కూరగాయలను తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అధికారులకు అందించారు.