NTV Telugu Site icon

Tirumala Laddu: శ్రీవారి భక్తులకు ప్రసాదం లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయా..?

Laddu

Laddu

Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రముఖ తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయి. ఇప్పుడు ఈ లడ్డూలను కర్ణాటకలోని నందిని నెయ్యితో తయారు చేయలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఏకంగా 350 టన్నుల నెయ్యి కోసం ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత ఫెడరేషన్ కూడా నెయ్యి సరఫరా చేయడం మొదలు పెట్టింది. లడ్డూ లలో నెయ్యి రుచిపై నిరంతర ఫిర్యాదుల దృష్ట్యా టీడీడీ ఈ కసరత్తును చేసింది. ఇందులో భాగంగానే నెయ్యి నాణ్యతపై ఫిర్యాదుల విషయంలో టీటీడీ ఇప్పటికే పాత విక్రేతను హెచ్చరించింది కూడా.

Mokshagna -Simba : వారసుడు దిగుతున్నాడు.. గెట్ రెడీ బాయ్స్

అయినప్పటికీ., ఎటువంటి మెరుగుదల లేదు. అందుకోసం ఇప్పుడు నెయ్యి విక్రేతను మార్చారు. ఈ నిర్ణయం తర్వాత ప్రసాదం కోసం నందిని నెయ్యిలో మాత్రమే లడ్డూలు తయారు చేస్తామని, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లో ఈ విధానం వర్తిస్తుందని టీటీడీ అధికారికంగా తెలిపింది. తిరుమలలో భక్తులకు ప్రసాదంగా రోజుకు 3.5 లక్షల లడ్డూలను టీటీడీ అందజేస్తుంది. అయితే ఈ లడ్డూల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో విచారణ చేపట్టారు. నాణ్యతను పరిశీలించేందుకు నియమించిన సురేంద్రరెడ్డి కమిటీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని మార్చేందుకు శ్రీకారం చుట్టింది. దీని తర్వాత నందిని నెయ్యి కొనుగోలు చేసేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా నందిని డెయిరీ గుర్తింపు పొందిందని టీటీడీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని మిల్క్ టెస్టింగ్ లేబొరేటరీలో నందిని కంపెనీ తయారు చేసిన నెయ్యి నాణ్యతను టీటీడీ స్వయంగా పరీక్షించింది.