NTV Telugu Site icon

Tirumala: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి.. టోకెన్లు ఇచ్చేది ఈ కేంద్రాల్లోనే..

Tirumala

Tirumala

Tirumala: వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుపతి, తిరుమలలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రంత టోకెన్‌ కేంద్రాల వద్ద జాగారం చేశారు. దీంతో అధికారులు టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే భక్తులు భారీగా తరలి రావడంతో.. కాస్తంత ముందుగానే నిన్న అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకెన్లు కోటా త్వరగతినే పూర్తైంది. మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ.

Read Also: TS E Challan Discount 2023: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ రాయితీ..?

ఇది ఉండగా.. టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా మాస్కులు ధరించాలని టీటీడీ భక్తులకు సూచించింది. మెడికల్‌ క్యాంపులను కూడా ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాలకు భక్తులు ముందుగానే తరలి వచ్చారు. రద్దీ నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేసే టికెట్ కేంద్రాన్ని అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పరిశీలించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు. రేపు వైకుంఠ ఏకాదశి. శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఎల్లుండి 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చేది ఈ కేంద్రాల్లోనే..
1. విష్ణునివాసం,

2. శ్రీ‌నివాసం,

3. గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు,

4. భూదేవి కాంప్లెక్స్‌,

5. రామచంద్ర పుష్కరిణి

6. ఇందిరా మైదానం,

7. జీవ‌కోన హైస్కూల్‌,

8. బైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌,

9. ఎంఆర్ ప‌ల్లిలోని జెడ్పీ హైస్కూల్‌