Site icon NTV Telugu

Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!

121 Kg Gold Ttd

121 Kg Gold Ttd

Anonymous Devotee Offers 121 Kg Gold to TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం కోట్ల రూపాయలు విరాళంగా అందుతాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపారవేత్త శ్రీవారికి కళ్లు చెదిరే విరాళంను అందజేశారు. ఏకంగా 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన P4 కార్యక్రమం లాంచింగ్ ఈవెంట్‌లో సీఎం మాట్లాడుతూ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం గురించి వెల్లడించారు. ఆ బంగారం విలువ రూ.140-150 కోట్లు ఉంటుంది.

‘ఓ వ్యక్తి కంపెనీ పెట్టాలనుకున్నాడు. అతడు శ్రీవారికి భక్తుడు. అనుకున్నట్లుగానే కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యాడు. అతను కంపెనీలోని 60 శాతం వాటాను అమ్మాడు. 60 శాతం అమ్మితే 1.5 బిలియన్ డాలర్లు (సుమారుగా 6-7 వేల కోట్లు) వచ్చాయి. శ్రీవారి దయ వల్ల తనకు ఇంత డబ్బు వచ్చిందని, తన వంతుగా స్వామి వారికి ఏదైనా విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకోవాలనుకున్నాడు. 121 కేజీల బంగారంను స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు. అయితే తన పేరు మాత్రం చెప్పొద్దని లెటర్ రాశాడు. 121 కేజీలే ఎందుకు అని అడిగా. తాను తెలుసుకున్నానని, శ్రీవారికి నిత్యం చేసే పూజల్లో 120 కేజీల బంగారాన్ని ఉపయోగిస్తారని చెప్పాడు. ఓ భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇస్తున్నదంటే అది అతడి గొప్పతనం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తూంటారు. శ్రీవారి ఆశీస్సులతో పైకి ఎదిగామని భావించే భక్తులు తమ సంపాదనలో కొంత విరాళంగా అందిస్తారు. చాలా మంది కొన్ని కోట్లు విరాళం ఇస్తూంటారు. కొంత మంది 4-5 కేజీల ఆభరణాలు విరాళం ఇస్తుంటారు. మరికొంతమంది తమ కంపెనీల్లో తయారు చేసే బస్సులు, లారీలను ఇస్తారు. అయితే అజ్ఞాత భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. ‘అంబానీకి కంటే గ్రేట్ సర్’ మీరు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version