Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో మే నెల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడిఫ్ విధానంలో పొందడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని టీటీడీ పేర్కొంది. ఇక 21వ తేదీ మధ్యహ్నం 12 గంటల నుంచి 23వ తేది మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో టికెట్లు పొందిన భక్తులు వాటిని ఆన్‌లైన్ విధానంలో పేపేంట్ చేసి టికెట్లు పొందేందుకు గడువు ఉంటుంది.
Read Also: CM YS Jagan: నేడు రాప్తాడులో ‘సిద్ధం’ సభ… పాల్గొననున్న సీఎం జగన్
అటు ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేయనుంది.