NTV Telugu Site icon

Tirumala Darshan: భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల అప్పుడే..

Ttd

Ttd

ఆగస్టులో శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు షెడ్యూల్‌ను తాజాగా టీటీడీ ప్రకటించింది. మే 18న శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని.. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయని టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌ లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌ లో టికెట్లు ఇస్తారని అధికారులు తెలిపారు.

Also Read: Deverakonda Brothers: అన్న‌య్య పుట్టిన రోజున ఎమోష‌న‌లైన తమ్ముడు.. పోస్ట్ వైరల్..

శ్రీవారి ఆలయంలో ఏటా ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మే 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో సేవా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని టీటీడీ ప్రకటించింది. ఆగస్టు కేటాయింపు, వర్చువల్ సర్వీస్ వ్యూయింగ్ స్లాట్‌లు మే 21న అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. అంగప్రదక్షిణం ఆగస్టు టోకెన్ కేటాయింపు మే 23న విడుదల కానుంది. ఇది ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Also Read: Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం.. వీడియో వైరల్..

వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమలకు వెళ్లేందుకు వీలుగా ఆగస్టు నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్‌ కోటా ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ ఆన్‌లైన్‌లో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రచురించబడుతుంది. ఆగ‌స్టు నెల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కోటాను మే 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయ‌నుంది. మే 24న తిరుమల, తిరుపతికి రూం కేటాయింపును ప్రకటించనున్న టీటీడీ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది., మే 27 తిరుమల – తిరుపతి శ్రీవారి సేవాకోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం కోసం తమ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో ప్రజలను కోరింది.

Show comments