హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ కు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమాక్స్ పరిసరాల్లో చిరు జల్లులు కురవడంతో ఇప్పటి వరకు జరగాల్సిన ప్రాక్టీస్ రేస్ ఆలస్యం కానుంది. ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మరోసారి క్వాలిఫై రేసింగ్ టైం మారింది. 3 గంటల 10 నిమిషాలకు జరగాల్సిన రేసింగ్ 3 గంటల 45 నిమిషాలకు మార్పు చేశారు అధికారులు. ఒక్కో రేసింగ్ కు 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది.
Also Read : Cyclone Effect to Tirumala: మాండూస్ ఎఫెక్ట్.. తిరుమల భక్తులకు వానకష్టాలు
అయితే… 5 గంటల తర్వాత లైటింగ్ తగ్గనుండటంతో ఇవాళ ఒక్క రేసింగ్ మాత్రమే జరిగే ఛాన్స్ ఉంది. మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు మూడు క్వాలి ఫై రేసింగ్స్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ కు సాగర్ తీర ప్రాంతంలో కార్ రేసింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే జల్లులు కురవడంతో.. రేస్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రేస్ వీక్షించేందుకు వచ్చినవారు తీవ్ర నిరాశకు చెందారు.
Also Read : Srileela Kiss: శ్రీలీల ‘కిస్’ కిక్ ఇస్తుందా..?
వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సన్నద్దతలో భాగంగా.. ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇవాల్టి నుంచి పెట్రోల్ కార్లతో జరిగే రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి. ఇందులో స్వదేశీ, విదేశీ రేసర్లు ఉన్నారు. పెట్రోల్ కార్లు 240 స్పీడ్‌తో వెళ్తాయని, ఎలక్ట్రిక్ కార్లయితే మాగ్జిమమ్ స్పీడ్ 320 వరకూ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. రేసింగ్‌ను 7,500 మంది వరకూ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. ఇక.. గత నెల 19, 20 తేదీల్లో హైదరా బాద్ లో తొలి రౌండ్ జరిగింది.
