Jasprit Bumrah: బుమ్రా కంటే అత్యుత్తమ పేసర్ ఎవరూ లేరు.. న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసలు!
- సియట్ అవార్డుల కార్యక్రమంలో సౌథీ
- బుమ్రాపై ప్రశంసలు
- బుమ్రా అత్యుత్తమ వెర్షన్‌ను చూస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim Southee hails Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై న్యూజిలాండ్ పేస్ బౌలర్ కమ్ కెప్టెన్ టిమ్ సౌథీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్లో బుమ్రా కంటే మరెవరూ బెటర్‌గా లేరని అభిప్రాయపడ్డాడు. తీవ్రమైన గాయంతో ఇబ్బందిపడిన బూమ్ బూమ్.. కోలుకొని వచ్చాక పునరాగమనం ఘనంగా చాటాడన్నాడు. ప్రస్తుతం బుమ్రా అత్యుత్తమ వెర్షన్‌ను చూస్తున్నామని సౌథీ చెప్పుకొచ్చాడు. బుధవారం ముంబైలో జరిగిన సియట్ అవార్డుల కార్యక్రమంలో సౌథీ పాల్గొన్నాడు.
‘తీవ్రమైన వెన్ను గాయంతో ఇబ్బందిపడిన జస్ప్రీత్ బుమ్రా కోలుకొని వచ్చి పునరాగమనం ఘనంగా చాటాడు. గతంలో కంటే ఇప్పుడు అత్యంత ప్రమాదకార బౌలర్‌గా మారాడు. గాయం ముందు కంటే ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా కనిపిస్తున్నాడు. అనుభవం అతడికి కలసివస్తోంది. ఆటను అర్థం చేసుకోవడంలో ఎంతో పరిణతి సాధించాడు. ప్రస్తుతం బుమ్రా అత్యుత్తమ వెర్షన్‌ను చూస్తున్నాం. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుత క్రికెట్లో బుమ్రా కంటే అత్యుత్తమ పేసర్ ఎవరూ లేరని నా ఉద్దేశం’ అని టిమ్ సౌథీ అన్నాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Google Pixel 9 Offers: ‘గూగుల్ పిక్సెల్ 9’ విక్రయాలు ఆరంభం.. 10 వేల రాయితీ!
2023 వన్డే ప్రపంచకప్ నుంచి 2024 టీ20 ప్రపంచకప్ వరకు జస్ప్రీత్ బుమ్రా తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు అతడికి విశ్రాంతిని ఇచ్చారు. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో బుమ్రా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఆపై ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆడనున్నాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..