నేడు మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి టాక్ తో అంచనాలకు మించి వసూల్లను కలెక్ట్ చేస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాలలో మంచి క్రేజ్ పెంచి ఎన్నో అంచనాలతో ప్రజల ముందుకు వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమాకు సంబంధించి అసలు షోస్ పడకముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. బయటికి బిజినెస్ పరంగా చూసిన.. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూసిన సినిమా కలెక్షన్లను రాబడుతోంది. ఒక హైదరాబాదులోనే ఈ సినిమాకి రూ1.25 కోట్ల గ్రాస్ బుకింగ్స్ జరిగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలపరంగా చూస్తే 2.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు సమాచారం.
Also Read: Kakarla Suresh: టీడీపీ జెండాను ఆవిష్కరించిన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్
ఇక ఓవర్సీస్ ప్రకారంగా చూస్తే.. ఈ సినిమాకు సేల్స్ ద్వారా ఏకంగా 250K డాలర్స్ మార్కును అందుకుంది. అలాగే నార్త్ అమెరికాలో కూడా 450K డాలర్స్ ప్రీమియర్స్ నుంచి సినిమా రాబట్టింది. అంతే కాదండి ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ఆస్ట్రేలియాలో 47k డాలర్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్లు సమాచారం. ఇక మిడిల్ రేంజ్ హీరోలలో టిల్లు స్క్వేర్ హవా చూపిస్తుందని ఇట్టే అర్థం అయిపోతుంది.
Also Read: Vizag Crime: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
ఈరోజు ముగిసే సమయానికి తెలుగు రాష్ట్రాలలో సినిమాకు సంబంధించి మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం లేకపోలేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల థియేటర్లలో విడుదలైంది. ఒక తెలుగు రాష్ట్రాల్లోను 550 పైగా థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల ఫ్రీ రిలీజ్ జరగగా, ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల రిలీజ్ మార్కెట్ సొంతం చేస్తుంది. దీంతో 28 కోట్ల బ్రేక్ ఈవెన్ ను సినిమాకు ఫిక్స్ అయింది.