Site icon NTV Telugu

Kejriwal: కేజ్రీవాల్ హెల్త్‌పై అధికారులు కీలక రిపోర్ట్! ఆందోళనలో ఆప్!

Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. సోమవారం ఆయన్ను జైలుకు తరలించారు. ఏప్రిల్ 15 వరకు రౌస్ అవెన్యూ కోర్టు… జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. అయితే కేజ్రీవాల్ ఆరోగ్యంపై జైలు అధికారులు కీలక రిపోర్టు విడుదల చేశారు. తొలి రోజు కేజ్రీవాల్ నీరసంగా ఉన్నారని.. అలాగే షుగర్ లెవల్స్ పడిపోయాయని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి కేజ్రీవాల్ కొద్ది సేపు మాత్రమే నిద్ర పోయినట్లు తెలిపారు.

ఇది కూాడా చదవండి: Tollywood: టాలీవుడ్లో వరుస విషాదాలు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి!

మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఈడీ కస్టడీకి రెండు సార్లు అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను సోమవారం సాయంత్రం 4 గంటలకు తీహార్ జైలుకు తరలించారు. ఇక సెల్‌లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువ ఉందని తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఔషధాలు అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు అందించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్దిసేపు కటిక నేలపైనే పడుకున్నారని, అర్థరాత్రి వరకూ సెల్‌లో అటు, ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి.

ఇది కూాడా చదవండి: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..

ఇక మంగళవారం ఉదయాన్నే ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్‌కు.. అనంతరం చాయ్‌, రెండు బిస్కట్లు అందించారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు.

సెల్ బయట జైలు వార్డర్‌తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసనర సేవల సిబ్బందినీ సెల్‌ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీకెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. కోరిన విధంగానే ఆయనకు రామాయణం, భగవద్గీత పుస్తకాలను అందించారు. అలాగే ఆయన మెడలో ఉన్న లాకెట్‌ను కూడా అనుమతించారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సతీమణి సునీతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూాడా చదవండి: Pushpa2 The Rule Teaser: పుష్ప గాడి కాళ్లకు గజ్జెలు కట్టి.. అద్దీ.. అట్టా హైప్ పెంచు మావ!

Exit mobile version