Site icon NTV Telugu

Collector Dilli Rao: స్ట్రాంగ్ రూమ్స్ కి సీల్ వేశాం.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం..!

Ntr Dist

Ntr Dist

Collector Dilli Rao: ఎన్టీఆర్ జిల్లాలో 27 స్ట్రాంగ్ రూములు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశామన్నారు. మిగిలినవి కూడా మరి కొద్దిసేపట్లో సీల్ వేయడం జరుగుతుంది అని వెల్లడించారు. వెంటిలేటర్లు, విండోలు అన్నీ సీల్ వేసాం.. రెండు లాక్ లు ఉంటాయి‌.. ఒక లాక్ కలెక్టర్ ప్రతినిధి దగ్గర మరో లాక్ ఆర్ఓ దగ్గర ఉంటాయన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్, స్టేట్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ లో ఉంటుంది.. ప్రతీ రోజూ ఇద్దరు ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నాం.. జిల్లా వ్యాప్తంగా 80.11 శాతం వరకూ వచ్చిందని అంచనా.. జగ్గయ్యపేటలో 90 శాతం దగ్గరలో పోలింగ్ జరిగినట్టు తెలిసింది అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పుకొచ్చారు.

Read Also: Modi: వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని.. హాజరైన ప్రముఖులు

అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11 వరకు పోలింగ్ జరగ్గా.. మైలవరం నియోజకవర్గంలో నాలుగైదు పోలింగ్ స్టేషన్లో రాత్రి 9:30 వరకు.. గన్నవరం నియోజకవర్గంలో పలు పోలింగ్ స్టేషన్లో రాత్రి 11:00 దాకా.. ఇక, మచిలీపట్నం నియోజకవర్గంలో రెండు పోలింగ్ బూత్లో అర్థరాత్రి 12 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. కాగా, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్లో రాత్రి 11 గంట వరకు.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నైట్ 10 వరకు జరిగ్గా.. చివరగా, పెనమలూరు నియోజకవర్గంలో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించారు.

Exit mobile version