తెలంగాణలోని అటవీ సరిహద్దు ప్రాంతాల వాసులను పులులు హడలెత్తిస్తున్నాయి. అయితే.. ఓ పులి తన 3 పిల్లలతో కలిసి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా భీంపూర్ మండల గ్రామీణ ప్రజలను ఒక పులి దాని మూడు పిల్లలతో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భీంపూర్ మండల గ్రామీణ జనాభాలో ఒక పులి దాని మూడు పిల్లలతో సంచరిస్తోంది. “మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా తిపేశ్వర్ టైగర్ రిజర్వ్ (టీటీఆర్)కి చెందిన ఆరేళ్ల పెద్దపులి, ఏడాది వయసున్న మూడు పిల్లలు మూడు వారాల క్రితం వాటి స్థావరాన్ని వెతుక్కుంటూ పెంగంగా నదిని దాటి తెలంగాణలోకి ప్రవేశించాయి.
Also Read : Beetroot Benefits : బీట్ రూట్‌తో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
నాలుగు రోజుల క్రితం రిజర్వ్‌కు వెళ్లి మళ్లీ ఈ ప్రాంతానికి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం భీంపూర్ మండల అడవుల్లో నివాసం ఉంటోందని జిల్లా అటవీశాఖ అధికారి పి.రాజశేఖర్ తెలిపారు. అయితే.. పులి దాని పిల్లల కదలికలను ట్రాక్ చేయడానికి నాలుగు యానిమల్ ట్రాకర్లు, 10 మంది బేస్ క్యాంప్ వాచర్లు, ఒక ర్యాపిడ్ రెస్క్యూ టీమ్, ముగ్గురు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పాటు డిపార్ట్‌మెంట్ సిబ్బందిని మోహరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. వారు ఈ ఆపరేషన్‌లో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS), వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF) వంటి ప్రభుత్వేతర సంస్థల వాలంటీర్ల సహాయాన్ని తీసుకుంటున్నారు.
Also Read : Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్ చోరీ.. స్పందించిన రైల్వేశాఖ
అయితే.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు గుంపులుగా వ్యవసాయ పనులు చేపట్టాలని, సాయంత్రం 6 గంటల తర్వాత పొలాల్లోకి రాకుండా చూసుకోవాలని సూచించారు. పశువులను అడవుల్లోకి తీసుకెళ్లవద్దని సూచించారు అధికారులు.