Tirumala: తిరుమల శ్రీవారి భక్తులను వన్యమృగాల భయం వీడడం లేదు. ఇటు టీటీడీ, అటు అటవీశాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా జనావాసాల్లోకి జంతువులు చొరబడుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ తిరుమల నడకదారిన వెళ్లిన భక్తులను హడలెత్తించిన చిరుతపులులు విరామం తీసుకుని మళ్లీ జనాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా మరోసారి అలిపిరి నడకమార్గంలో చిరుతపులి ప్రత్యక్షమైంది. దీంతో తిరుమల నడకదారి భక్తుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
Read Also: Weather Update : భారీగా పెరిగిన చలి.. ఈ రాష్ట్రాల్లో 10మందికి పైగా మృతి
తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం పట్టుకుంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచరిస్తోంది. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుత సంచారంపై టీటీడీ అప్రమత్తమైది. నడకదారి భక్తులను గుంపులుగా భద్రతా సిబ్బంది అనుమతిస్తోంది. ఇప్పటి వరకు అటవీశాఖ ఐదు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే.