Mulugu District: ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం.. ఫారెస్టు అధికారులు ఏమన్నారంటే?
- ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం
- సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు
- గోదావరి నది దాటి వచ్చిందని స్పష్టం
ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి ఎలాంటి హాని తలపెట్టదని అధికారులు తెలిపారు.
READ MORE: Syria: సిరియా నుంచి ఇండియాకు బయల్దేరిన భారతీయ పౌరులు.. ప్రస్తుతం ఎక్కడున్నారంటే?
Also Read
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్తో స్పెషల్ 'కొత్తిమీర రైస్' చేసేయండి ఇలా.!
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
- Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!
మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు. అదే పులిని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వేంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద, సాయంత్రం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు మాకిడి రైల్వే క్యాబిన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా గుర్తించారు. అలాగే… ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం బోదాపురం, ఆలుబాక సమీపంలోని గోదావరి లంకలోనూ మంగళవారం పులి సంచరించింది. బోదాపురం రైతు కొర్స నర్సింహారావు లంకభూమిలో పుచ్చ పంట సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి పంటకు రక్షణగా వెళ్లి అక్కడ వేసుకున్న పాకలో నిద్రించారు. అర్ధరాత్రి పులి గాండ్రింపులు వినిపించాయి. మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు.
తాజావార్తలు
-
Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
-
Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్తో స్పెషల్ ‘కొత్తిమీర రైస్’ చేసేయండి ఇలా.!
-
PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
-
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
-
Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!