Site icon NTV Telugu

Leopard Attacks: దడ పుట్టిస్తున్న పులుల దాడులు.. ఒకేరోజు ముగ్గురిపై దాడి, ఇద్దరు మృతి!

Leopard Attack In Chandrapur

Leopard Attack In Chandrapur

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. పులుల దాడులలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నాడు. మరో బాలుడిని అటవీ ప్రాంతంలోకి చిరుత లాక్కెళ్ళింది. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లా ఉలిక్కిపడింది.

చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్ (40) తన పొలంలో పనికి వెళ్లినప్పుడు ఆమె మెడపై పులి దాడి చేసింది. పులి దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో మౌజా లావరీ గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో పులి దాడిలో లాఖపూర్ గ్రామానికి చెందిన సునీల్ రౌత్ (32) అనే పశువుల కాపరి మృతి చెందాడు. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో పశువులు మేపడానికి వెళ్లిన సునీల్‌పై పొదల్లో దాక్కుని ఉన్న పులి దాడి దాడి చేసి చంపేసింది.

Also Read: Asia Cup 2025: పీసీబీకి ఐసీసీ ఈమెయిల్‌.. పాకిస్థాన్‌పై చర్యలు?

సిందేవాహి తాలూకాలోని గడ్బోరి గ్రామంలో గురువారం రాత్రి ప్రశీల్ బాబన్ మంకర్ (9)అనే బాలుడిని ఇంటి ప్రాంగణం నుంచి చిరుత పులి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంకు వన్య ప్రాణులతో ముప్పు ఉందని గ్రామస్తులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version