Leopard Attacks: దడ పుట్టిస్తున్న పులుల దాడులు.. ఒకేరోజు ముగ్గురిపై దాడి, ఇద్దరు మృతి!
- మహారాష్ట్రలో దడ పుట్టిస్తున్న పులుల దాడులు
- ఒకేరోజు ముగ్గురిపై పులుల దాడి
- పులుల దాడులలో ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. పులుల దాడులలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నాడు. మరో బాలుడిని అటవీ ప్రాంతంలోకి చిరుత లాక్కెళ్ళింది. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లా ఉలిక్కిపడింది.
చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్ (40) తన పొలంలో పనికి వెళ్లినప్పుడు ఆమె మెడపై పులి దాడి చేసింది. పులి దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో మౌజా లావరీ గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో పులి దాడిలో లాఖపూర్ గ్రామానికి చెందిన సునీల్ రౌత్ (32) అనే పశువుల కాపరి మృతి చెందాడు. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో పశువులు మేపడానికి వెళ్లిన సునీల్‌పై పొదల్లో దాక్కుని ఉన్న పులి దాడి దాడి చేసి చంపేసింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Asia Cup 2025: పీసీబీకి ఐసీసీ ఈమెయిల్.. పాకిస్థాన్‌పై చర్యలు?
సిందేవాహి తాలూకాలోని గడ్బోరి గ్రామంలో గురువారం రాత్రి ప్రశీల్ బాబన్ మంకర్ (9)అనే బాలుడిని ఇంటి ప్రాంగణం నుంచి చిరుత పులి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంకు వన్య ప్రాణులతో ముప్పు ఉందని గ్రామస్తులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..