NTV Telugu Site icon

Trans Gender: ఎస్సై ఉద్యోగం సాధించిన ముగ్గురు ట్రాన్స్ జెండర్స్..ఎక్కడంటే..?

Trans Gender

Trans Gender

ట్రాన్స్ జెండర్స్ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న విషయం తెలిసిందే. వారు ఎక్కడ కనిపించిన ఆదరించే వారి కంటే చీదరించుకునే వాళ్లు ఎక్కువ. ట్రాన్స్ జెండర్లలో కొందరి వల్ల ప్రస్తుతం అందరూ అసమానతలకు గురవుతున్నారు. కానీ బీహార్ రాష్ట్రంలో మాత్రం ట్రాన్స్ జెండర్లు ప్రతిభ కనబరిచారు. ఉన్నత చదువులు చదవటమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బీహార్ పోలీస్ అండర్ సర్వీస్ కమిషన్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు విజయం సాధించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా అవతరించారు. ఈ ముగ్గురు ట్రాన్స్‌జెండర్లలో ఇద్దరు ట్రాన్స్ మెన్ కాగా, ఒకరు ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు.

READ MORE: Nag Ashwin Love: ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా?

పరీక్షలకు హాజరైన 6788 మంది అభ్యర్థుల్లో 1,275 మంది అభ్యర్థులు ఉద్యోగం సాధించారు. వీరిలో 822 మంది పురుషులు, 450 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఉద్యోగం సాధించిన వారిలో 275 మంది షెడ్యూల్డ్ కులాలు, 238 మంది EBC, 100 OBC, 87 మంది మహిళలు – 11 EWS, 16 షెడ్యూల్డ్ తెగల వారు ఉన్నారు. మధు కాకుండా, మరో ఇద్దరు ట్రాన్స్ రోనిత్, బాంటీ ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్లుగా ఉన్నారు. గతేడాది నిర్వహించిన బీహార్ కులాల సర్వే ప్రకారం రాష్ట్రంలో 40,827 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.

READ MORE: Vizag Steel Plant: విశాఖకు కేంద్ర ఉక్కు మంత్రి.. స్టీల్‌ ప్లాంట్‌ వర్గాల్లో ఉత్కంఠ..

బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాన్వి మధు కశ్యప్ ట్రాన్స్‌జెండర్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా అవతరించారు. ఐదు పోస్టులు ట్రాన్స్‌జెండర్లకు రిజర్వ్ చేసినప్పటికీ ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. దీంతో మిగిలిన రెండు స్థానాలను జనరల్ కేటగిరీలో చేర్చారు. ఈ సందర్భంగా మధు కశ్యప్ మాట్లాడుతూ.. “సమాజానికి భయపడి ఇన్ని రోజులు బతికాను. ఇంతకుముందు నా తల్లిని కలవడానికి రహస్యంగా పాట్నాకు వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు యూనిఫాంతో మా గ్రామానికి వెళ్తాను. నేను ట్రాన్స్ జెండర్ గా ఉన్నందుకు సిగ్గుపడటం లేదు. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు సాధారణ అమ్మాయి కాదని తేలింది. ఆ తర్వాత క్రమంగా సమాజం నుంచి వెలివేసి నన్ను ఒంటిరిదానిగా చేశారు.” అని ఆమె వ్యాఖ్యానించారు.