Devara: ‘దేవర’ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?.. ఎన్టీఆర్ కెరీర్లోనే స్పెషల్!
- సెప్టెంబర్ 27న థియేటర్లో మాస్ జాతర
- ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్స్
- ఈవెంట్ దద్దరిల్లిపోవడం గ్యారెంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Pre Release Event Chief Guests: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. సెప్టెంబర్ 27న థియేటర్లో మాస్ జాతరకు రెడీ అవుతున్న టైగర్ ఫ్యాన్స్.. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ పండగ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్న ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ‘దేవర’ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ పాల్గొనే అవకాశం ఉంది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు వినిపించాయి. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి క్లారీటీ లేదు. తాజాగా మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఈవెంట్‌కి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ గెస్ట్లుగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అతిథులుగా హాజరు కాబోతున్నారట. రాజమౌళి, ఎన్టీఆర్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్‌కు గ్లోబల్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఘనత జక్కన్నదే. ఇక అరవింద సమేత తర్వాత మరోసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. దాంతో త్రివిక్రమ్ ప్లేస్‌లో కొరటాల ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్రివిక్రమ్ గెస్ట్‌గా వస్తుండడం విశేషం.
Also Read
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
Also Read: Mad Square: ‘లడ్డు గాని పెళ్లి’ లిరికల్ సాంగ్ విడుదల.. మాములుగా లేదుగా! వీడియో చూడాల్సిందే
ఇక కేజీఎఫ్, సలార్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ చేశారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీంతో ఎన్టీఆర్, నీల్ కాంబోపై ఎక్కడా లేని అంచనాలున్నాయి. కొరటాలతో పాటు ఈ ముగ్గురు కూడా దేవర ఈవెంట్లో సందడి చేస్తే.. మామూలుగా ఉండదనే చెప్పాలి. ఈ నలుగురు ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు అనిరుధ్ లైవ్ షో ఉంటే.. దేవర ఈవెంట్ దద్దరిల్లిపోవడం గ్యారెంటీ. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ ఈవెంట్ ఎంతో స్పెషల్‌గా నిలిచిపోనుంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!