Site icon NTV Telugu

Hindu Temples Attack In Bangladesh: మూడు హిందూ దేవాలయాలపై దాడి.. ఆందోళనలో ప్రజలు

Bangladesh

Bangladesh

Hindu Temples Attack In Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసనల మధ్య చిట్టగాంగ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఇందులో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చిట్టగాంగ్‌లో దుండగులు లోక్‌నాథ్ ఆలయం, ఫిరంగి బజార్‌లోని మానస మాత ఆలయం, హజారీ లేన్‌లోని కాళీ మాత ఆలయాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు, ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆయన బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. మరోవైపు దేశంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ పాలనలో ఇస్లామిక్ ఛాందసవాదుల నియంత్రణ లేకుండా పోయిందని, దేశంలోని హిందువులను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని దేవాలయాలపై దాడులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆగస్టు 5న షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత దేశంలో హిందువులపై ఓ రకమైన ‘మారణహోమం’ జరుగుతోంది.

Also Read: Urvil Patel: విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ

ఇస్లామిక్ ఛాందసవాదుల వ్యవస్థీకృత దాడులకు ప్రతిస్పందనగా హిందువులు పెద్ద సంఖ్యలో శాంతియుతంగా నిరసనలు చేయడం మొదలు పెట్టడంతో.. ఇలాంటి చర్యలు ప్రారంభమయ్యాయి. హిందవుల నిరసనలు ప్రధానంగా వారి సామాజిక, మతపరమైన సంస్థ ఇస్కాన్ ద్వారా నిర్వహించబడ్డాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనుచరులు ఉన్న సంగతి తెలిసిందే. నిరసనల దృష్ట్యా, ప్రముఖ హిందూ నాయకుడు అలాగే ఇస్కాన్ సెయింట్ చిన్మోయ్ కృష్ణ దాస్‌ను సోమవారం ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక చిన్మయానంద్ దాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లోని ఠాకూర్‌గావ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందూ మైనారిటీలపై బంగ్లాదేశ్ సైన్యం దాడి చేసింది.

Also Read: Allu Arjun Remuneration: షాకింగ్.. 300 కోట్లు ఏంది సామి?

Exit mobile version