NTV Telugu Site icon

Yadadri Temple: 18న యాదాద్రి సందర్శనకు కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలు!

Yadadri Temple

Yadadri Temple

Yadadri Temple: ఈనెల 18న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూడు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు సందర్శించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ కోసం ఖమ్మం వెళ్లనున్న ముఖ్యమంత్రులు.. దారిలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నట్లు సమాచారం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రెసిడెన్షియల్ సూట్స్, హెలిప్యాడ్ స్థలాన్ని రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు.

Khammam BRS Meeting: 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. కనీవినీ ఎరగని స్థాయిలో..

ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది. ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఈ బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరవుతారని ముందునుంచి చెప్పుకొస్తున్నారు. అయితే.. తెలంగాణ సరిహద్దు జిల్లా కావడంతో.. 3 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ సభలో పాల్గొంటారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రుల పర్యటన వివరాలు ఇలా..

* 18వ తేదీన ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి యాదాద్రికి బయల్దేరనున్న ముఖ్యమంత్రులు

* 2 ప్రత్యేక హెలిక్యాప్టర్లలో యాదాద్రికి కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్

* 11.30 గంటలకు యాదాద్రి కి చేరుకోనున్న ముగ్గురు సీఎంలు

* యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న ముగ్గురు సీఎంలు

* 12.30 గంటలకు యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరనున్న ముఖ్యమంత్రులు

* కంటి వెలుగు రెండో దఫా ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ముగ్గురు ముఖ్యమంత్రులు

* 3.30 గంటలకు ఖమ్మం పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం లు

* 4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లిపోనున్న కేజ్రీవాల్, విజయన్

Show comments