Site icon NTV Telugu

Ramoji Rao: రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ తరఫున ముగ్గురు సీనియరు అధికారులు

Ramoji Rao News

Ramoji Rao News

Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముగ్గురు సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. రేపు జరిగే అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా రజత్ భార్గవ, ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్ హాజరు కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏపీ సీనియర్ అధికారులు నివాళులర్పించనున్నారు.

Read Also: Pawan kalyan : రామోజీని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు..

మరోవైపు ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. రామోజీరావు మృతికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించగా.. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.

Exit mobile version