Tragedy: ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిలో పోతిరెడ్డి లోకేష్(19) విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులు కుందురి చందు కిరణ్ రెడ్డి(18), బత్తుల మణికంఠ రెడ్డి(18)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల కుటుంబ సభ్యులను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. వారిని ఎమ్మెల్యే ఓదార్చారు.
Read Also: Suicide: నాలుగు రోజులు ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య?
