NTV Telugu Site icon

Drown in Canal: కడప జిల్లాలో విషాదం.. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి

Swimming

Swimming

Drown in Canal: వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో విషాదం చోటుచేసుకుంది. అలవలపాడులో ఆదివారం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్‌(8), సాయి తేజ(11), చిన్నారుల మేనమామ శశికుమార్‌ గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. సమీపంలోని జీఎన్ఎస్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందగా.. గ్రామస్థులు వారి ముగ్గురిని వెలికి తీసి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read Also: Dispute : అత్తను చంపి అడ్డులేదనుకుంది.. సీన్ రివర్స్ అవుతుందని ఊహించలేకపోయింది

అసలెలా జరిగిందంటే.. సాయితేజ, సుశాంత్‌ల అమ్మ మృతి చెందడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నారు. బంధువైన జ్ఞానయ్య ఈస్టర్‌ పండుగకు వీరి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ పిల్లలకు మేనమామ అయిన శశికుమార్‌తో కలిసి అందరూ కాలువలో ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. మిగిలిన ముగ్గురూ ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్‌ నాయక్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments