NTV Telugu Site icon

New Trains in AP: ఏపీలో రేపు మూడు రైళ్లు ప్రారంభం

New Trains

New Trains

New Trains in AP: ఆంధ్రప్రదేశ్‌లో రేపు మూడు రైళ్లు ప్రారంభం కానున్నాయి. రేపు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రైళ్లను ప్రారంభించనున్నారు. హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Read Also: Harsha Kumar: షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక కుట్రే.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అదే విధంగా కాకినాడ టౌన్‌, నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్‌ 07487/07488 అనే నంబర్లు గల ప్రత్యేక రైలు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2.25కు నాందేడ్‌లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడకు చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6.30కు కాకినాడలో బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 నాందేడ్‌కు చేరుకుంటుదన్నారు. ఈ రైలు బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి, సికింద్రాబాద్‌, ఖాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం,కొండపల్లి, రాయనపాడు, ఏలూరు. రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు.