Site icon NTV Telugu

Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Ts Rains

Ts Rains

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Also Read : Samantha: ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు.. ఆమెకు తల్లిగా సమంత..?

మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలెర్ట్‌ను వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ (మంగళవారం) పెద్దపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపోడులో 73.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

Also Read : Kishan Reddy: ఢిల్లీలోని పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది..

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. రైతులు చెట్ల కింద ఉండకూడదని తెలిపింది. రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. వానలు పడే సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెప్పుకొచ్చారు.

Exit mobile version