Site icon NTV Telugu

Vaccination: వికటించిన టీకా.. మూడు నెలల చిన్నారి మృతి

Vaccination

Vaccination

Vaccination: టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మూడు నెలల చిన్నారికి వ్యాక్సిన్ వేసిన 24 గంటల తర్వాత మరణించినట్లు ఆరోగ్య అధికారి శుక్రవారం తెలిపారు. రామ్‌గఢ్ సివిల్ సర్జన్ డాక్టర్ ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ.. మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆ బాలుడికి చెందిన విసేరాను భద్రపరుస్తామని, తద్వారా శిశువు మరణానికి గల కచ్చితమైన కారణాలు కనుగొనడానికి వీలవుతుందని తెలిపారు. అంతేకాదు, అరుదుగా చోటుచేసుకున్న ఇలాంటి ఘటనను రాష్ట్ర డబ్ల్యూహెచ్‌వో బృందం కూడా దర్యాప్తు చేస్తోంది.

Madhya Pradesh: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన భార్య

గురువారం పట్రాటులోని సీహెచ్‌సీలో పారామెడికల్ సిబ్బంది బాల అభిరాజ్ కుమార్‌కు డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటనస్, హెపటైటిస్-బి వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి పిల్లలను రక్షించే పెంటావాలెంట్ వ్యాక్సిన్‌ను వేశారు. ఆ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పోలీసు అధికారి తెలిపారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. అయితే అజాగ్రత్త మరియు అసురక్షిత టీకా కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని, బాధ్యులను అరెస్టు చేసి హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని అతని తల్లిదండ్రులు బబ్లూ సావో, లలితా దేవి డిమాండ్ చేశారు.

Exit mobile version