NTV Telugu Site icon

US: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు మృతి

Car Us

Car Us

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన టెక్సాస్‌లోని లంపాసాస్‌ కౌంటీలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల అరవింద్ మణి, అతని భార్య 40 ఏళ్ల ప్రదీపా అరవింద్, 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మరణించినట్లు సమాచారం. అరవింద్ మణి కుటుంబం లియాండర్‌లో నివసిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్కరే మిగిలారు. ప్రమాదం జరిగిన సమయంలో అరవింద్ మణి 14 ఏళ్ల కుమారుడు అడ్రియన్ కారులో లేడని సమాచారం.

Rishabh Pant: రిషబ్ పంత్లో ఈ కళ కూడా ఉందా.. వీడియో వైరల్

U.S. రూట్ 281లో కారు ప్రయాణిస్తోందని టెక్సాస్ భద్రతా అధికారులు తెలిపారు. ఈ కారును డ్రైవర్ జాసింటో కోవ్ నడుపుతున్నాడు. వారు కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కారు వెనుక టైరు పగిలింది. దీంతో కారు అదుపు తప్పి మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా.. మృతి చెందారు. కారులో అరవింద్ మణి, అతని భార్య, కుమార్తెను ఉత్తర టెక్సాస్‌లోని కళాశాలకు తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగింది. అయితే అదృవశాత్తు తల్లిదండ్రులు తమ కొడుకును ఇంటి వద్ద వదిలిపెట్టారు. దీంతో.. అతను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే.. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోవడంతో తీవ్రంగా రోదిస్తున్నాడు. మరోవైపు… ప్రమాద ఘటనపై పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ ట్రూపర్ బ్రియాన్ వాష్కో మాట్లాడుతూ.. “నా 26 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి ఘోరమైన ప్రమాదాన్ని చూడటం ఇదే తొలిసారి” అని అన్నారు.

Komatireddy Venkat Reddy : మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు..

ఈ ప్రమాదంపై రూస్ స్కూల్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేశారు. అతను ఒక లేఖ వ్రాశాడు. ‘మా విద్యార్థి ఆండ్రిల్ అరవింద్ మరణించారని తెలియజేయడానికి నేను చాలా బాధపడ్డాను. ఆండ్రిల్ మరియు అతని తల్లిదండ్రులు ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్తతో మేము చాలా బాధపడ్డాము. మా ఆలోచనలు ఆండ్రిల్ కుటుంబంతో ఉన్నాయి. కుటుంబంలో జీవించి ఉన్న ఏకైక సభ్యుడు అడ్రియన్‌కు సహాయం చేయడానికి $758,000 కంటే ఎక్కువ సేకరించాం’ అని తెలిపారు.