Site icon NTV Telugu

Maoists: పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

Maoists

Maoists

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ ఆపరేషన్ తో మావోలు అడవిని వీడి జనంబాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మరో ముగ్గురు సీనియర్ మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు జన జీవన స్రవంతి లో కలిశారని తెలిపారు. కుంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్‌ చందు, తోడెం గంగ అలియాస్‌ సోనీ (ఛత్తీస్‌గఢ్‌) మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని తెలిపారు.

Also Read:Taliban minister: ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు కీలక హామీ.. పాకిస్తాన్‌కు తాలిబాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

వీరిలో చందు , సోని భార్య భర్తలు. వికాస్ సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి. 1990 నుండి మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నాడు.. 35 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో గడిపాడు. చందు – (45ఏళ్ళు)10 ఏళ్ల వయసులో నే విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యాడు. 1993 లో నర్సంపేట దళంలో చేరాడు.. మిగిలిన మావోయిస్ట్ లు కూడా బయటికి రావాలని మేము కోరుతున్నామని డీజీపీ వెల్లడించారు. 412 మంది మావోయిస్టులు ఇటీవల కాలంలో లొంగిపోయారు. వీరిలో 72 మంది తెలంగాణ మావోయిస్ట్ లు ఉన్నారు. వీరిలో 8 మంది కేంద్ర కమిటీ వారు ఉన్నారు.

Also Read:AP Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్!

మావోయిస్టు వికాస్ మాట్లాడుతూ.. దళానికి సెక్రటరీ నీ ఇంకా నియమించలేదు.. మల్లోజుల మాకు అందుబాటులో లేడు.. కోల్డ్ బెల్ట్ లో మావోయిస్ట్ ల చర్యలు మొదలు పెట్టేందుకు చూశారని చెప్పాడు. మావోయిస్టు వెంకటయ్య మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీలో విభేదాలు వాస్తవమే.. అగ్ర నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి.. ఆయుధాలు వదిలి పెట్టాలని చర్చ మల్లోజుల జగన్ మధ్య కొనసాగుతూనే ఉంది.. ఆయుధాలు వదిలిపెట్టాలనే చర్చ పార్టీలో ఎప్పటినుండో ఉంది.. మావోయిస్టు పార్టీలో ఆధిపత్య పోరు సహజమే అని తెలిపాడు.

Exit mobile version