Site icon NTV Telugu

Encounter: మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టుల మృతి!

Maredumilli Encounter

Maredumilli Encounter

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎంకౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలం కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్ మృతి చెందినట్లు తెలుస్తోంది.

Also Read: Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్!

మృతుల్లో మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య రావి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణ ఉన్నట్టు సమాచారం. మరొకరి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంజు ఉన్నట్లు గుర్తించారు. ఉదయ్‌ది వరంగల్ జిల్లాలోని వెలిశాల గ్రామం కాగా.. అరుణది అనకాపల్లి జిల్లా పెందుర్తి గ్రామం. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version