NTV Telugu Site icon

Road Accident: రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థుల మృతి!

Road Accident

Road Accident

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్‌ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు.

మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14 మంది) కర్ణాటకలోని హంపి క్షేత్రానికి సమీపంలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో పూజలకు బయల్దేరారు. సిందనూరు వద్ద చక్రాల బోల్టులు ఊడిపోవడంతో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర.. డ్రైవర్‌ శివ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. కర్నాటక ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసుల మృతి చెందడంతో.. అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు.