NTV Telugu Site icon

Road Accident: కరీంనగర్ లో రోడ్డు యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

Accident

Accident

కరీంనగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరు యువకులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకి చికిత్స కోసం తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

Read Also: BAN vs IND: టీమిండియాకు ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు ఎంపిక.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి వారు అని స్థానికులు తెలిపారు. పని ముగించుకొని రేణిగుంటలో ఓ దాబాలో భోజనం చేసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాల సేకరించారు. మృతులు గుడ్డిపల్లి అరవింద్, శివరాత్రి సంపత్, శివరాత్రి అంజిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ముగ్గురు యువకులు మృతితో రామంచ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read Also: Health Tips: భరించలేని మైగ్రేన్‌తో బాధపడుతున్నారా?

మరోవైపు హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో సోమవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.