పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో కంపెనీ కీలక ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన ప్రసాదిత్యా కంపెనీతో మాలికి చెందిన డైమండ్ ఫ్యాక్టరీకి పార్టనర్ షిప్ ఉంది. భారతీయుల కిడ్నాప్ తో ప్రసాదిత్యా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజ్‌మెంట్ మాలికి బయల్దేరి వెళ్ళింది. మరోవైపు.. బమాకాలోని ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగింది. కిడ్నాప్‌కు గురైన భారతీయులు కుటుంబ సభ్యులతో ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
కిడ్నాప్‌కు గురైన ఇండియన్స్ ను సాధ్యమైనంత త్వరగా విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నాప్ ఎవరు చేశారన్న దానిపై ఇంకా ఏ సంస్థ ప్రకటించలేదు. కాగా.. మాలిలో ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ ఎంబసీ సూచించింది. కిడ్నాప్ కు గురైన వారిలో మహారాష్ట్ర కు చెందిన జోషితో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరిగా గుర్తించారు. జోషి డైమండ్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. మిగతా ఇద్దరు లిఫ్ట్ సర్వీస్ ఇంజినీర్, ఆటోమొబైల్ ఫోర్‌మెన్ గా గుర్తించారు.
READ MORE: RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదల..!
