జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని మూడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఆగ్నేయ రైల్వే ఖరగ్‌పూర్ డివిజన్‌లోని సర్దిహా జార్గ్రామ్ సెక్షన్‌లోని 143 కిలోమీటరు వద్ద స్తంభం నంబర్ 11/13 మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న మూడు ఏనుగులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఒక పెద్ద ఏనుగు ఉండగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఈ సంఘటన రాత్రి 12:50 గంటలకు జరిగింది.
Also Read:Tirumala Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం.. రేపే అక్టోబర్ నెల టికెట్లు విడుదల
సంఘటన సమాచారం అందిన వెంటనే, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే బృందం రాత్రిపూట సంఘటన జరిగిన ప్రదేశానికి బయలుదేరి సహాయక చర్యలు చేపట్టింది. చనిపోయిన ఏనుగుల మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తొలగించారు. అప్ లైన్ ను ఉదయం 6:15 గంటలకు, డౌన్ లైన్ ను ఉదయం 7:30 గంటలకు పునరుద్ధరించారు రైల్వే అధికారులు ఈసంఘటనపై రైల్వే ఖరగ్‌పూర్ డివిజన్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
