NTV Telugu Site icon

AP Cyber Crime: సీబీఐ పేరుతో వీడియోకాల్.. మహిళ నుంచి రూ.25 లక్షలు కాజేసిన కేటుగాడు..

Cyber Crime

Cyber Crime

AP Cyber Crime: దోపిడీ తీరు మారుతుంది.. సైలెంట్‌గా ఫోన్లు చేసి.. వైలెంట్‌గా మాట్లాడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు.. పోలీసులు అధికారులమంటూ.. సీబీఐ ఆఫీసర్‌ను అంటూ.. ఈడీ ఆఫీసు అంటూ.. ఎయిర్‌పోర్ట్‌లో మీకు సంబంధించిన వస్తువులు నిలిచిపోయాయంటూ.. ఇలా ఏదో ఇక ఇష్యూతో వారిని ముగ్గులోకి దింపి డబ్బులు గుంజుతున్నారు. తాజాగా ఏలూరులో మరో ఘటన వెలుగుచూసింది.. సీబీఐ అధికారిని అంటూ బెదిరించి మహిళ వద్ద నుంచి లక్షలు కాజేశారు కేటుగాళ్లు.. ఏలూరు 3 టౌన్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది..

Read Also: Figs Health Benefits: అంజీర పండ్లను అలసత్వం చేయొద్దు.. ముఖ్యంగా గర్భిణీలు.. ఎందుకంటే.?

ఏలూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యానగర్ కు చెందిన పాము సెల్వా రోజ్లిన్ కు అపరిచిత వ్యక్తి నుండి ఈ నెల 18వ తేదీన ఫోన్ కాల్ వచ్చింది.. మేం సీబీఐ నుండి ఫోన్ చేస్తున్నామంటూ.. మాటలు ప్రారంభించిన ఆ వ్యక్తి.. మీ పేరిట ఓ కొరియర్ వచ్చిందని.. అందులో.. పాస్‌పోర్టు, పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్ ఉన్నాయని నమ్మబలికారు.. అంతేకాదు.. మీపై కేసు నమోదు చేస్తున్నామని బెదిరింపులకు దిగాడు.. వీడియో కాల్ చేసి పార్సిల్‌ను.. అందులో ఉన్న వస్తువులు ఇవేనంటూ చూపించాడు.. దీంతో.. సదరు మహిళ బెదిరిపోవడంతో.. ఆ భయాన్నే క్యాష్‌గా మార్చుకోవలన్న ఆలోచనతో ఉన్న ఆ కంత్రీగాడు.. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని భయపెట్టాడు.. ఊహించని పరిణామంతో హడలిపోయిన బాధతురాలు.. ఆ కేటుగాడు చెప్పిన బ్యాంకు ఖాతాకు.. దపదపాలుగా ఏకంగా రూ.25,60,500 పంపింది.. తర్వాత మోసపోయానని గ్రహించి.. త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు..