NTV Telugu Site icon

Actress Sridevi: శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత

sridevi

sridevi

Actress Sridevi: అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాష ఏదైనా సరే, తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది శ్రీదేవి. బాలీవుడ్ లో కూడా ఆమె ప్రస్థానం తారాస్థాయికి చేరింది. సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్గా శ్రీదేవి రికార్డు సృష్టించింది. అందం, అభినయం, నటన, చలాకితనం ఇలా అన్ని కలగలిపి ఉండే వ్యక్తిగా శ్రీదేవి పేరుగాంచింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన ఆమె ప్రస్థానం బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోయిన్గా చేరింది. ఇకపోతే, ఈ అందాల నటి దూరమై ఆరు సంవత్సరాలు అవుతోంది. శ్రీదేవి చనిపోవడం అభిమానులకు తీరని లోటు. ఇదిలా ఉండగా, ఓ టాలీవుడ్ రచయిత ఆమె మరణంపై నోరు పారేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతిపోగొట్టిన నేషనల్ క్రష్

శ్రీదేవి వ్యక్తిత్వాని కించపరిచేలా సినీ ప్రముఖుడు తోటపల్లి మధు కొన్ని కీలక వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో చేశారు. ఇందులో భాగంగా శ్రీదేవి ప్రతిరోజు తాగుతుండేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా అనేది రంగుల ప్రపంచమని, ఒక్కసారి మేకప్ చేసుకుంటే అందులో నుండి బయటకు రావడం కష్టమంటూ.. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరిని తెలిపారు. అంతేకాకుండా, 55 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణంగా ఆవిడ మరణించిందని.. ఆవిడకు డయాబెటిస్, హైబిపి లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడిందని తెలియజేశాడు. అలాగే శ్రీదేవి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, ఇంకా డైట్ అంటూ ఆమె తక్కువుగా తినేది అంటూ తెలిపాడు. అయితే, ఆవిడ మంచి డ్రింకర్ అని ప్రతిరోజు తాగేదంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారాన్ని లేపుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. చనిపోయిన ఆవిడ పై ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ

Show comments